మధురవాడ జోన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జోనల్ కమీషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లతో సమావేశమయ్యారు. లా కాలేజీ సమీపంలో ప్రతిపాదిత స్థలంలో జోనల్ కార్యాలయం నిర్మాణ పనుల డిజైన్లకు సాధ్యమైనంత త్వరగా తుది రూపు ఇవ్వాలని చెప్పారు. ఎండాడ మెయిన్ రోడ్డు పక్కన జీవీఎంసీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి.. అందులో కొన్ని షాపులను హాకర్స్ కు కేటాయించేలా చూడాలన్నారు. మధురవాడ జోన్ లో ఉన్న పార్కుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని, పార్కుల నిర్వహణలో స్థానికంగా ఉన్న కాలనీ అసోసియేషన్ లను భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. స్మశానాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రూ. 2.5 కోట్లతో సాగర్ నగర్ లో ప్రతిపాదించిన నైట్ ఫుడ్ కోర్టు.. అలాగే సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని అన్నారు. ఎండాడ, సాగర్ నగర్ ప్రజలు కోరుతున్న రైతు బజార్ కు స్థల సేకరణ కోసం చర్చించారు. జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు పాల్గొన్నారు.
కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో
