Home Politics Andhra Pradesh ప్రభుత్వ పాఠశాలల్లో

ప్రభుత్వ పాఠశాలల్లో

0

పిల్లలను చదివించండి
కాజులూరు గ్రామం లో ప్రభుత్వ పాఠశాల ల్లో పిల్లలను చేర్పించుటకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ప్రతీ ఇంటికి వెళ్ళి తల్లితండ్రులను ప్రభుత్వ పాఠశాలల గురించి వివరించామని ఎం.ఈ.ఓ దాసరిపల్లె డేవిడ్ చెప్పారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చేర్పిస్తే కలిగే ప్రయోజనాలను తెలియచేస్తూ గ్రామం లో బ్యానర్, ఫ్లెక్సీలు స్లొగన్స్ తోగ్రామం లో ప్రతి ఇంటింటికి తిరిగామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో 21 రకాల కిట్స్ విద్యార్థులు ఇస్తున్నారని మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని, ఫీజు రీయిబ్రెస్మెంట్ వంటి అనేక ప్రయోజనాలు తో పాటు నాణ్యమైన విద్య ను అందిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమం లో పి జాన్, పద్మ లత కాజులూరు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు
మార్ని విష్ణుమూర్తి కాజులూరు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గారావు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడల్ ప్రైమరీ కాజులూరు విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తానని హామీ ఇచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version