కొయ్యూరు మండల రెవెన్యూ తహసీల్దార్ మురళి బాబు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మారుమూల యు చిడిపాలెం మఠం భీమవరం పంచాయతీలలో కొత్తగా నియమితులైన ఎమ్మార్వో మురళి బాబు సందర్శించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఎమ్మార్వో మురళి బాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా స్థానిక ఎమ్మార్వో ఎంపీడీవో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమక్షంలో ప్రతి గురువారం రెవెన్యూ కార్యాలయంలో మండల స్థాయి భూ సమస్యలు సత్వర పరిష్కారం చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా కేంద్రం గ్రీవెన్స్ కు వెళ్లే భారం లేకుండా స్థానిక భూ సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. మారుమూల గ్రామాలైన యు చీడిపాలెం, మఠం భీమవరం పి ఎల్ కొత్తూరు,పుట్టకోట అనేక గ్రామాలలో డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఆధార్ కరెక్షన్ సమస్యను గుర్తించామని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. నేరుగా రెవెన్యూ కేంద్రానికి రాకపోయినా తమ వాట్సాప్ నెంబర్…8247845510 కి వివరాలు అందజేయాలని తెలియజేశారు. పుట్టకోట గ్రామంలో పాఠశాల లేకపోయినా నూతనంగా నియమితులైన ఉపాధ్యాయుడు తమ సొంత నిధులతో రేకుల షెడ్డు వేసి విద్యార్థులకు పాఠాలు బోధించడం ఆదర్శనీయమని కొనియాడారు. ఇది ఇలా ఉండగా ఎమ్మార్వో గా విధులకు హాజరైన తక్షణమే మారుమూల పంచాయితీలు చుట్టుముట్టి సమస్యలు గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పరిష్కార మార్గం వెతుకుతున్న ఎమ్మార్వో మురళి బాబుకు మండల వాసులు తమ ప్రశంసలు తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తున్నారు.
