Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshటిడిపిలో ఉంటూ వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తా-చింతకాయల విజయ్

టిడిపిలో ఉంటూ వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తా-చింతకాయల విజయ్

  • టిడిపిలో ఉంటూ వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తా.. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
  • టీడిపిలో నాకు పదవులు రాకపోయినా అసంతృప్తి చెందలేదు.
  • తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు..
  • టిడిపి కార్యకర్తలను అధికారులు గౌరవించకపోతే బదిలీలు తప్పదు…
  • కార్యకర్తల అభీష్టమే పార్టీ ధ్యేయం.

నర్సీపట్నం – జయ జయహే, ప్రత్యేక ప్రతినిధి:

టిడిపి పార్టీలో కొనసాగుతూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తానని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రతిష్టమైన పునాదులని అలాంటి వారిని అధికారులు గౌరవించకపోతే బదిలీలు తప్పవని సూచించారు.నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో మండల, కస్టర్, యూనిట్ గ్రామ బూత్ ఇన్చార్జిల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ , అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షులు , గృహ నిర్మాణ శాఖ చైర్మన్ భక్తుల తాతయ్యబాబు , కాకినాడ జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ , చింతకాయల రాజేష్ , జడ్పిటిసి సభ్యులు సుకల. రమణమ్మ హాజరయ్యారు. కార్యక్రమంలో తొలిత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటావిష్యరణ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ టిడిపి పార్టీలో గతంలో నాకు పదవులు రాకపోయినా నేను ఎప్పుడు అసంతృప్తి చెందలేదని కార్యకర్తల ఉద్దేశం తెలియజేశారు. పదవులు ముఖ్యం కాదు పార్టీ సిద్ధాంతమే ముఖ్యమని నూతన ఉత్తేజంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలన్నారు. టిడిపి ,జనసేన, బిజెపి నాయకులు సంయుక్తంగా కలిసి గ్రామాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని నిశ్శబ్దతకు నిలువుటద్ధం అని పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్త ఆత్మ గౌరవ సూచికంగా ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసి వారి జీవితాల్లో జీవన ప్రమాణాలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. అనంతరం ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బి. రాంప్రసాద్ , టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రఫీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments