మాడుగుల బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం హాస్టల్‌లో కిచిడీ తిన్న ఏడుగురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లగా అసెంబ్లీ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లో సరఫరా చేసిన ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ, నీటి కలుషితం కావచ్చు, ఆహార లోపం కావచ్చు, మరే కారణం అయినప్పటికీ ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉందని,అయితే 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచామని చెప్పారు.
