సిటీ పోలీస్ కమిషనర్ ప్రజలకు ఇచ్చిన నెంబరు 7995095799 కు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తిని విశాఖ నగర పోలీసులు రక్షించారు. ఈ సంఘటనకు సంబందించి ఆదివారం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ నగరంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని తన స్నేహితుడికి ఫోన్ ద్వారా తెలియజేయగా, ఆ స్నేహితుడు వెంటనే విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ప్రజలకు ఇచ్చిన ఫోన్ నెంబరుకు కాల్ చేసి సహాయం కోరడంతో ఆయన తక్షణం స్పందించి టెక్ సెల్ ఎస్.ఐ కి సదరు వ్యక్తి లొకేషన్ ట్రేస్ చేసి రక్షించాలని ఆదేశించారు. త్వరితగతిన ఆ బాధితుని లొకేషన్ గుర్తించి కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రవికుమార్ కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు ఆ వ్యక్తిని సకాలంలో గుర్తించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. సదరు వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఫోన్ చేయగానే వెంటనే స్పందించి తన స్నేహితుడు ప్రాణాలు కాపాడినందుకు సిపి కి, కంచరపాలెం పోలీసులకు ఆ వ్యక్తి తన కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన ఫోన్… ఓ ప్రాణాన్ని కాపాడింది…!
RELATED ARTICLES
