గుండె చికిత్సలకు మెరుగైన వైద్యం
` ప్రారంభించిన మంత్రి శ్రీ వీరాంజనేయ స్వామి
కింగ్ జార్జ్ హాస్పిటల్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో రూ. 2 కోట్ల విలువైన ఆధునిక హార్ట్-లంగ్ మెషిన్ మరియు హీమోథెర్మ్ (టెంపరేచర్ కంట్రోల్ యూనిట్)ను మంగళవారం జిల్లా మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ పరికరాలను ఐసీఐసీఐ ఫౌండేషన్ సీఎస్సార్ నిధులతో అందించింది.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రి చరిత్రను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా ప్రత్యేక కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇదేనన్నారు. ఇది దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దూరదృష్టి ఫలితమని తెలిపారు. ఈ సందర్భంగా కార్డియాలజీ విభాగానికి అదనంగా క్యాథ్ ల్యాబ్ మంజూరు చేయడం, సీఎస్సార్ ద్వారా కొత్త భవనాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ యంత్రం ద్వారా క్లిష్ట గుండె శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించవచ్చని, అద్దె పరికరాలపై ఆధారపడకుండా ఖర్చులు తగ్గి, సేవలు నిరంతరంగా అందించవచ్చన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పేద రోగులకు ఈ శస్త్రచికిత్సలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం. సంధ్యాదేవి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రాధా కృష్ణన్, డాక్టర్ జి. వాసవి లత, డీసీఎసఆరఎంఓ డాక్టర్ ఆర్.వి.ఎస్. కుమార్, అడ్మినిస్ట్రేటర్ బి.వి. రమణ పలువురు విభాగాధిపతులు హాజరయ్యారు.
కేజీహెచ్‌లో రూ. 2 కోట్ల విలువైన హార్ట్ లంగ్ మెషీన్ ప్రారంభం
RELATED ARTICLES
