Home News గోవులతో ఆరోగ్యం ఆనందం* – గోవర్ధనపురం గోశాల నిర్వాహకులు దొడ్డా మహేష్

గోవులతో ఆరోగ్యం ఆనందం* – గోవర్ధనపురం గోశాల నిర్వాహకులు దొడ్డా మహేష్

0

నిరంతరం గోవుల సేవలో నిమగ్నమవుతూ గోమాత ను ఆరాధిస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం, పెదగుజ్జువాడ గ్రామానికి చెందిన దొడ్డా మహేష్.అవనీర్ గ్రానైట్స్ పేరిట వ్యాపారం చేస్తున్నప్పటికీ.. గోవులను సంరక్షించడం, పంచగవ్యాలు ప్రయోజనాలు తెలియజేయడం, గో ఆధారిత వ్యవసాయానికి ఊతమివ్వడం తనకు ఎంతో ఆనందమిస్తుందని చెబుతున్నారు మహేష్. పెదగుజ్జువాడ గ్రామం లో గోవర్ధనపురం గోశాల ను నిర్వహిస్తున్న మహేష్.. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆవులను సంరక్షించి వాటి ద్వారా ప్రయోజనాలను పది మందికి అందిస్తున్నారు. గుజరాత్ కు చెందిన కాంక్రేజ్, పంజాబ్ కు చెందిన సాహివాల్, రాజస్థాన్ కు చెందిన రాఠి, పుంగనూరు కు చెందిన చిన్న పరిణామం ఆవులు, తార్ ఎడారి ప్రాంతానికి చెందిన తార్ పార్కర్ ఆవులను సంరక్షిస్తున్నారు.తను ఏర్పాటు చేసిన గోశాల ద్వారా స్వచ్ఛమైన, నాణ్యమైన పంచగవ్యాలను అందజేస్తున్నారు. సింహాచలం గోశాల లో ఏప్రిల్ 1 నుండి ఐదు రోజుల పాటు జరిగిన శబల భోజనాలు పండుగ సందర్భంగా తమ గోశాల కు చెందిన గోవులను ప్రదర్శించడం తో పాటు గో ఆధారిత ఉత్పత్తుల కూడిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.అలాగే శబల భోజనాలు తయారీ కి వీలుగా కొంత పాలు, నెయ్యి విరాళంగా అందజేశారు. అలాగే పెద్దగుజ్జువాడ, చినగుజ్జువాడ కు చెందిన 40 మంది రైతులకు గో ఆధారిత వ్యవసాయం చేసేందుకు వీలుగా అవగాహన కల్పించేందుకు దొడ్డా మహేష్ నడుంబిగించారు. పశుపోషణ విషయం లో మెలుకువలు తెలిపేందుకు ముందుకొచ్చారు. 40 మంది రైతులకు ఇన్పుట్స్ ఇచ్చి,వారు వ్యవసాయం చేసుకునేందుకు విలువ తోడ్పాటునందించి ఊరికి భరోసాగా నిలవనున్నారు. 40 మంది రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే బాధ్యతను కూడా దొడ్డ మహేష్ సభల భోజనాల పండుగ సాక్షిగా తీసుకున్నారు.ప్రకృతి సేద్యం.. పశుపోషణ కు దొడ్డా మహేష్ చేస్తున్న కృషిని ప్రకృతి ప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయాన్ని కాంక్షిస్తున్న వారు ప్రశంసిస్తున్నారు. రైతులు గోవులకు దూరం కావడం సరికాదని, పాడిపంటల పట్ల ఆసక్తి చూపుతూ గో ఆధారిత వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని దొడ్డ మహేష్ కోరుకుంటున్నారు. అవుతో అనంతం, అభివృద్ధి,ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికం, ఆర్థికం సమకూరుతుందని మహేష్ తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version