Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshజీవీఎంసీ ప కమిషనర్ సుడిగాలి పర్యటన

జీవీఎంసీ ప కమిషనర్ సుడిగాలి పర్యటన

జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గార్గ్ నియోజకవర్గంలో 66, 73వార్డులలో జోనల్ కమిషనర్ శేషాద్రి తో పాటు పలు అధికారులతో కలిసి పర్యటించారు. గురువారం జరిగిన ఈ పర్యటనలలో వార్డుల టిడిపి అధ్యక్షులు గోమాడవాసు సింగూరు అనంతులు ప్రధాన కమిషనర్ తో పాటు వార్డులో పర్యటించి వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 66వ వార్డు పరిధిలో మోహిని థియేటర్ వెనుక ఉన్న ప్రధాన గడ్డ తోపాటు కణితి రోడ్డు రత్నా వారి వంటిల్లు కూడలిలో ఏర్పాటు అవుతున్న సెంటర్ ఫౌంటైన్ పనులను పరిశీలించారు. ఫౌంటైన్ పనుల ఆలస్యంపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మళ్ళీ పర్యటన వస్తానని ఇంజనీర్ విభాగం సభ్యులందరూ ఉండాలని సూచించారు. అలాగే అలాగే ఇంటి పనులు సేకరణ విషయంలో కూడా కమిషనర్ ప్రశ్నించారు. అదే ప్రాంతంలో ఉన్న ఒక గృహ యజమాని సుమారు రెండు లక్షల రూపాయలు ఇంటి బకాయి ఉండడంతో వారికి ఈ నెలాఖరు వరకు గొడవిచ్చి బకాయి ఉన్న పూర్తి సొమ్మును చెల్లించాలని లేనియెడల సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments