ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం
శ్రీకాకుళం జిల్లాలో హరిచంద్రపురం రైల్వే స్టేషన్ లో ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు ప్రజా సౌకర్యార్థం గుణుపూర్ నౌపడ విశాఖపట్నం రైల్వే పాసింజర్ రైలు హాల్టను కేంద్ర విమానయాన మంత్రి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చుo నాయుడు సంయుక్తంగా ప్రజా సంక్షేమం కోసం హరిచంద్రపురం లో పాసెంజర్ రైలు హాల్టను ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో ప్రజలు చిరకాలంగా చేస్తున్న విజ్ఞప్తి కి ఫలితం లభించింది ,కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించి నందుకు ఇరువురు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. హరిచంద్రపురం రైల్వే స్టేషన్ లో గుణుపూర్ విశాఖ పాసింజర్ రైలు హాల్టతో ప్రజల చిరకాల సకారం రవాణా సౌకర్యం కల్పించిన ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చుo నాయుడు లకు ఈ ప్రాంత ప్రజలు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, హర్షం వ్యక్తం చేశారు.
