ఈ నెల 23న వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని స్థానిక స్వయం భు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసములు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎస్.వి.వి. సత్యనారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అవకాశం ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆలయంలో నిర్వహించబోయే సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆసక్తి గలవారు ఆలయంలో ముందుగా తెలియజేయాలని కోరారు. గాంధీ గ్రామం శ్రీ విజ్ఞాన్ స్కూల్లో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ ఎం.ఎం.కె. రాజు తెలియజేశారు. అక్షయభ్యాసానికి కావాల్సిన సామాగ్రిని ఉచితంగా అందజేస్తామని, … గడిచిన 33 సంవత్సరాలుగా విద్యార్థులకు అక్షరాభ్యాసం సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ముందుగా సంప్రదించాలని కోరారు.
