Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshకాకరపాడు లో ఘనంగా

కాకరపాడు లో ఘనంగా

శ్రీరామనవమి వేడుకలు..

కొయ్యూరు మండలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. కాకరపాడులో జరిగిన ఈ వేడుకల్లో జలమూరి కుటుంబం గత వంద ఏళ్లుగా మూడు తరాల నుండి సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది వేడుకను పండితుడు రామచంద్రమూర్తి శర్మ మంత్రోచ్ఛారణల మధ్య చిటికెల కిషోర్ దంపతులు పవిత్ర క్రతువులో పాల్గొన్నారు. వేడుకను వీక్షించేందుకు భక్తులు తరలిరాగా, అనంతరం అందరికీ భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంప్రదాయం గ్రామ ప్రజల్లో ప్రత్యేక భక్తి భావాన్ని నింపింది.
ఈ కార్యక్రమానికి వేద సంకల్ప సేవ ట్రస్టు వారు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమాన్ని జలుమూరి నాగేశ్వరావు, చంద్రశేఖర్,గణబాబు, వెంకట గిరిబాబు, గోవిందరావు,ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధన్యంరాజు పద్మరాజు, డి.వి.డి ప్రసాద్, నౌండ్రు శ్రీను,పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments