Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఘనంగా శివరాత్రి వేడుకలు

ఘనంగా శివరాత్రి వేడుకలు

జగంగూడలో శివనామ స్మరణతో మారుమోగిన శివక్షేత్రం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శామీర్‌పేట్ మండల పరిధిలోని జగన్‌గూడ గ్రామంలోని శివాలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం 5 గంటల నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఆలయ అర్చకులు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం తదితర విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అభిషేకాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments