Home Politics Andhra Pradesh వాయిదా పడ్డ సంత వేలం పాట

వాయిదా పడ్డ సంత వేలం పాట

0

మాడుగుల గ్రామపంచాయతీలో సోమవారం సాయంత్రం నిర్వహించిన వార్షిక సొంత వేలంపాట ఈనెల 25కి వాయిదా పడింది. గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి అధ్యక్షతన జరిగిన ఈ వేలం పాటలో మాడుగులతో పాటు ఈవిధ ప్రాంతాలకు చెందిన 27 మంది పా పాల్గొన్నారు. అయితే గత ఏడాది వేలంపాట తొమ్మిది లక్షల 24 వేలుకు వెళ్ళగా, సోమవారం జరిగిన పాటలో మండల సతీష్ చివరిగా 8,25,000 రూపాయలు వరకు పాడారు. తదుపరి పాట ఆగిపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నాటికి వాయిదా వేస్తున్నట్టు గ్రామ కార్యదర్శి ఆర్ నాయుడు తెలిపారు. గత ఏడాది పాట కంటే ఎక్కువ వస్తానే వేలంపాట కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జే వరహాలు, పంచాయతీ సభ్యులు ఎస్ శ్రీనివాసరావు, ఎస్ సత్తిబాబు, ఎస్ జగన్, జి అచ్యుతం తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version