చోడవరం మండలం శ్రీరామ్ పట్నం గ్రామంలో గురువారం రామాలయ పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.దీనిలో భాగంగా జెర్రిపోతుల శంకరరావు, కళ్లేపల్లి గున్నయ్యశెట్టి కుటుంబ సభ్యులు చే అభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,సమరసత ఫౌండేషన్ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
