చోడవరం చిత్రకళ నిలయం వారు నిర్వహించిన అఖిలభారత బాలల చిత్రకళ పోటీలలో చోడవరం మండలం గవరవరం విద్యార్థులు 8 బంగారు పతకాలు, నగదు బహుమతి, ప్రశంస పత్రాలు పొందారు. చిత్రకళ నిలయం నిర్వాహకుడు బొడ్డేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మీరు రాష్ట్రాల చంద్ర బాల బాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ గీతాలక్ష్మి,డిఎస్ ప్రసాద్, ప్రసాద్ రాజు, ప్రకాష్ మాస్టారు, ఎన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులను ఎంఈఓలు పాండురంగారావు, సింహాచలం, హెచ్ఎం డీజే సుందర్ సింగ్ అభినందించారు.
