Home Politics Andhra Pradesh గాంధీ మార్గం అనుసరణీయం

గాంధీ మార్గం అనుసరణీయం

0

సత్యం, అహింసతో దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో అందరూ నడవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎంవీపీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటీష్ చెర నుంచి భారతీయులకు విముక్తి కల్పించిన గాంధీ మహాత్ముడు సదా స్మరణీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, పిల్లా వెంకట్రావు, గరే గుర్నాథ్, పాసి నరసింగరావు, చెట్టుపల్లి గోపీ, కోరాడ రమణ, నాగోతి సత్యనారాయణ, పంచదార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version