Home Politics Andhra Pradesh పీఎం జన్మన్ గృహాల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలి.

పీఎం జన్మన్ గృహాల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలి.

0

మండలంలోని
పిఎమ్ జన్మన్ పక్కా గృహాలు బకాయి బిల్లులు మంంజూరుచేయాలనీ,రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచిన బిల్లులు వెంటనే లబ్ధిదారులకు విడుదల చేయాలనీ ఆదివాసీ గిరిజన సంఘం డుంబ్రిగూడ మండల కమిటీ ఆద్వర్యంలోని భారి ర్యాలీ చేస్తూ డిమాండ్. డుంబ్రిగూడ మండలం డిప్యూటీ తహాశిల్దార్ కు వినపత్రం అందజేసి ఈ సందర్బంగా అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు పాంగి సురేష్ కుమార్, డుంబ్రిగూడ మండల కార్యదర్శి తామర్ల సూర్యనారాయణ మాట్లాడుతూ డుంబ్రిగూడ మండల పరిధిలో సుమారు 59గ్రామాల పీవిటీజీ లబ్ధిదారులు సుమారు 1300మంది వివిధ దశలో జన్మన్ గృహాలు నిర్మాణం చేసుకున్నారనీ, అయితే లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గృహా నిర్మాణాలు నిలిచిపోయిందనీ చెప్పారు. పీవిటీజీలు ఆర్ధికంగా వెనుక బడటంతో ఇతర ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారనీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఒక లక్ష రూపాయలు నేటికీ విడుదల చేయకపోవడం సమంజసం కాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా దశల వారిగా బిల్లులు మంజూరు చేయాలనీ కోరారు. లేకపోతే భవిష్యత్ లో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎస్బీ పోతురాజు . మండల అధ్యక్షులు పాంగి సత్యనారాయణ, పాంగి డొంబు,పెసా కార్యదర్శి కొర్రా సీతన్న, వంతల రామేజీరావు, కొర్రా దామెదార్, వంతల సోంబ్రు, మర్రి రామన్న .తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version