రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కడియం పరిసర ప్రాంతాల్లో కానిస్టేబుల్‌గా, హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించి ప్రజల మన్ననలు పొందిన చుక్కల వెంకటరమణకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990 బ్యాచ్‌కు చెందిన రమణ పోలీస్ శాఖలో ఫ్రెండ్లీ పోలీస్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించారు. అందరితో మెలిసి, సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించే అధికారిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వేమగిరిలో స్థిరపడిన రమణకు కడియం మండలం అణువణువూ తెలుసు. స్థానిక పరిస్థితులు, నాయకుల పాత్రపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం వల్ల ఎక్కడికి బదిలీ అయినా డిప్యుటేషన్‌పై తిరిగి కడియం తీసుకురావడం విశేషం. అనేక వివాదాలను ఆయన సూచనలతో సమర్థవంతంగా పరిష్కరించారు. కేవలం పోలీస్ అధికారిగానే కాకుండా కుటుంబ పరంగా కూడా రమణ ఆదర్శంగా నిలిచారు. ఆయన కుమారుడు సూర్యకుమార్ విశాఖపట్నం సెంట్రల్ జైలులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తుండగా, మరో కుమారుడు గోవిందరాజు ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ పీజీ చేస్తున్నారు. ఏఎస్ఐగా పదోన్నతి పొందిన రమణ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు అభినందనలు తెలిపారు.
ఫ్రెండ్లీ పోలీస్ రమణకు ఏఎస్ఐగా పదోన్నతి
RELATED ARTICLES
