శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని సింగమాల పంచాయతీలో ఉచిత పశువైద్య శిబిరాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏ.వి.హెచ్ శ్రీకాళహస్తి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ యం.గోవిందరాజ భాస్కర్, డాక్టర్ శరత్ చంద్రరెడ్డి లు మాట్లాడుతూ మండలంలోని పశువులకు,మేకలకు,పొట్టేలకు,గొర్రెలకు తప్పనిసరిగా బీమా చేయించాలని,భీమా చేయిస్తే జీవాలు అనారోగ్యంతో మృతి చెందుతే సంబంధిత రైతులకు బీమా అందుతుందన్నారు.నాటు పశువులకు 816 రూపాయలు,మేలు జాతి పశువులకు 1632 రూపాయలు బీమా సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు.రైతులు ఈ పశుభీమాని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పశు సంవర్ధక శాఖ ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వెటర్నరీ వైద్యులు తదనగుణంగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారని అన్నారు.కోళ్లల్లో వస్తున్న వ్యాధులను నివారించాలనే ఉద్దేశంతో ఈ వ్యాధి నిరోధక టీకాలను వేస్తున్నట్లు తొట్టంబేడు పశు సంవర్ధక శాఖ వైద్యులు డాక్టర్ శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.తొట్టంబేడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావిళ్ల.మునిరాజనాయుడు ఆదేశాల మేరకు సర్పంచ్ మాధవి టిడిపి కార్యకర్తలైన కమల్నాథ్ గుర్రప్ప ఆధ్వర్యంలో పశువులకు,దూడలకు డిటెక్టింగ్ మరియు డివార్మింగ్ చేయడం జరిగింది.గొర్రెలకు నట్టల నివారణ మందును తాగించారు.పశు వైద్యులు పశువులలో తలెత్తే గర్భకోశ వ్యాధులకు చికిత్స చేశారు.జనవరి నెల 19వ తేదీన ప్రారంభమైన ఈ పశువైద్య శిబిరాలు జనవరి 31 తేదీ వరకు కొనసాగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి,టిడిపి కార్యకర్తలు కమల్నాథ్, గుర్రప్ప,పశు వైద్యాధికారులు ఫార్మస్టాఫ్ రవిబాబు,రాజయ్య,పశు సంవర్ధక శాఖ సహాయకులు లీలాకృష్ణ, తేజ,కళ్యాణ్ యూసఫ్,జగదీష్,గోపాలమిత్ర స్వతంత్రబాబు పాల్గొన్నారు.
సింగమాలలో ఉచిత పశు వైద్య శిబిరాలు కార్యక్రమం
RELATED ARTICLES
