Home Uncategorized నేడు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

నేడు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

0

ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి అనిత
– భూమి పూజతో రాష్ట్ర అభివృద్ధికి నాంది

పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో సోమవారం నిర్వహించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత శంకుస్థాపన జరగనున్న ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక, హెలిపాడ్, గ్యాలరీల వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, రేపు జరిగే కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. ఇది కేవలం భూమి పూజ మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నాంది అని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారిందని, స్టీల్ ప్లాంట్ కోసం రైతులు చేసిన త్యాగాలు మరువలేము అన్నారు. తమ భూములు, గ్రామాలు ఇచ్చిన రైతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని, దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version