Home Politics Andhra Pradesh ఆరోగ్యంపై దృష్టి సారించాలి

ఆరోగ్యంపై దృష్టి సారించాలి

0

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా విజయనగరం తిరుమల మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తారక రవి కిరణ్, ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ జగదీష్ లు పలు రకాలైన సూచనలు చేశారు. వారు తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనే నినాదంతో ఈ ఏడాది ముందుకు వెళుతుందని చెప్పారు. ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు. పిల్లలకి చిన్ననాటి నుంచి మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒత్తిడి లేకుండా రెగ్యులర్ గా ఎక్సర్ సైజు చేసుకోవాలన్నారు. బయట ఆహారాన్ని తీసుకోకూడదని ఇంటిలో వండిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో సెంటర్ హెడ్ నాగ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version