Home Politics Andhra Pradesh చదరంగం లో ఐతం ప్రధమ ద్వితీయo గెలుపు

చదరంగం లో ఐతం ప్రధమ ద్వితీయo గెలుపు

0

అంతర్ కళాశాల చదరంగం పోటీల్లో టెక్కలి ఐతం కళాశాల విద్యార్థులు ప్రధమ ద్వితీయ బహుమతులను కైవసం చేసుకున్నారు, జేఎన్టీయూ గురజాడ విజయనగరంలో నిర్వహించిన ఈ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు విజయం సాధించడం పట్ల కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఈ చదరంగం పోటీల్లో బాలుర జట్టుకు కెప్టెన్ గా బి జీవన్, బాలికల జట్టుకు కెప్టెన్ గా ఆర్ మహాలక్ష్మి నాయకత్వం వహించి తమ సమర్థతను చాటారని ఇరు జట్ల విజయం పట్ల కళాశాల యాజమాన్యం అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏ ఎస్ శ్రీనివాసరావు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వి మురళీధర్, పి డీలు ఎన్ లక్ష్మణ్ మూర్తి, టి మురళీమోహన్, జె తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version