Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshసిరివెన్నెల సీతారామ శాస్త్రి విగ్రహావిష్కరణ చేసిన ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ శ్రీనివాస్

సిరివెన్నెల సీతారామ శాస్త్రి విగ్రహావిష్కరణ చేసిన ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ శ్రీనివాస్

స్థానిక గాంధీనగరం రామాలయం రోడ్ లో గల పార్కులో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకలు త్రివిక్రమ శ్రీనివాస్ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఈ విగ్రహవిష్కరణలో పాల్గొనడం జరిగింది. వీరు ముందుగా స్థానిక గవరపాలెంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ నుండి గాంధీ నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరికి పట్టణ ప్రజలు అభిమానులు కూటమి నాయకులు మేళతాళాలతో వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య భారీ స్వాగతం పలకడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ అనంతరం స్థానిక శాసనసభ్యులు స్థానిక రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కీర్తిశేషులు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మన అనకాపల్లి వాసి కావడం గర్వకారణం అని నేను ఎన్నో చిత్రాలకు రచనలు సినీ గీతాలు చేసి ఎంతో మంచి అవార్డులు పొందారని
ఎన్నో సినిమాలకు పాటలు పద్యాలు కూడా పాడారని ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తిని ఈనాటికి అనకాపల్లి ప్రజలు తలుచుకోని వారు ఉండరని ఆయన సినిమాలు చూసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారని అని అయనా పేర్కొన్నారు. ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కాంస్య విగ్రహం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని అలాంటి మహోన్నత వ్యక్తి సినీ గేయ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి మీ అనకాపల్లి వాసి కావడం చాలా ఆనందంగా ఉందని ఎన్నో సినిమాలకి రచనలు చేసిన ఎన్నో సినిమాలకు విజయాలు అందించిన ఆ మహోన్నత వ్యక్తిని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకొని ఆయన తలుచుకోవడం ఆనందంగా ఉందని అలాంటి మహోన్నత గొప్ప కళాకారుడు, సినీ రచయిత మరొకరు లేరని ఆయనకు ఆయనే సాటి అని ఆయన పేర్కొన్నారు ఆయన స్వగ్రామ్ అనకాపల్లి వచ్చి ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments