మాడుగుల భారత నిర్మాణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం పాలకేంద్ర భవనంలో విశాఖకు చెందిన శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మాడుగుల నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 100 మంది రోగులు వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 50 మందికి కంటి ఆపరేషన్లు పడతాయని గుర్తించి వారికి ఉచితంగా ఆపరేషన్లు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ 396 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయనతోపాటు భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు హరిచందన. గ్రామ సర్పంచ్ యడ్ల కళావతి. ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు. అనకాపల్లి జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షులు శ్రీనాథు శ్రీనివాసరావు. మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు. మేనేజర్ అరుణ్ కుమార్. సిబ్బంది దేవి. తో పాటు భారత నిర్మాణ సేవా ట్రస్ట్ సభ్యులు గౌరీపట్టపు మహేష్ కుమార్,పుట్టా బలరాం,దొడ్ల సుబ్బరత్నమ్మ,పేలూరి కృష్ణారావు,సాధన శ్రీను, గూడెపు శ్రీను. మేస్త్రి సూరిబాబు. పెద పాటి నాగు. యాదగిరి గోవింద్. ఎస్ అశోక్. సిహెచ్ మధు. ఆప్తాలిక్ అసిస్టెంట్ పి నాగలక్ష్మి. పాల్గొన్నారు
ఉచిత నేత్ర శిబిరానికి విశేష స్పందన
RELATED ARTICLES
