రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లు లోని క్వారీ సెంటర్ సమీపంలోని సింహాచలం నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి క్షేత్రంలో ఈ నెల 25 నుంచి 30 వరకు జరగనున్న చందన యాత్ర మహోత్సవాలకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రస్టు ధర్మకర్తలు కాలేను సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
నిజరూప దర్శనం జరిగే జనవరి 28వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు తాగునీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలు కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
చందన యాత్ర సందర్భంగా అన్నదాన కార్యక్రమం, భజనలు, ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంచనున్నాయని ఆలయ అధికారులు అభిప్రాయపడ్డారు.
చందన యాత్రకు సర్వం సిద్ధం – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
RELATED ARTICLES
