ప్రతి ఒక్కరూ సామాజిక సమస్యలపై స్పందించాలి
నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేసిన డాక్టర్ కందుల
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు
35వ వార్డు, కళ్ళపాకలు ప్రాంతానికి చెందిన నవ వధువు బి. తిరుమలకు
, నలినీ దేవి దంపతులు బంగారు తాళిబొట్టు, పట్టు బట్టలు, పసుపు కుంకుమ అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
నేటి యువత సామాజిక అంశాల పై విరివిగా స్పందించాలన్నారు.
ఇతరులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు.
మానవత్వంతో స్పందించి అర్హులైన వారికి సహాయం చేస్తే,
వారిని చూసి మరి కొంతమంది ముందుకు వచ్చి, వారి బాటలోనే నడుస్తూ, మంచి పనులు చేసేందుకు వెనకడుగు వేయరని చెప్పారు. తమ కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించడం జరిగిందన్నారు.
సేవే పరమావధిగా భావించి, ఇతరులకు మంచి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని,
తన వార్డు పరిధి మేరకే కాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ మొత్తం అంతా తన సేవలను విస్తృత పరిచినట్లు వెల్లడించారు.
ఎవరికైనా కష్టం వస్తే అక్కడ తాను ఉంటానని, ఒక కుటుంబ సభ్యుడిగా వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తానని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కే.అప్పారావు, గౌరీ, గాజుల శ్రీను, కుమారి, వరలక్ష్మి, కోదండమ్మ, నీలిమ, అర్జునమ్మ, తలుపులమ్మ, భారతి, భవాని తదితరులు పాల్గొన్నారు.
