Home Politics Andhra Pradesh సీఎం అయినా ఆయన సామాన్య కార్యకర్తే!

సీఎం అయినా ఆయన సామాన్య కార్యకర్తే!

0
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన  పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో సాధారణ కార్యకర్తలా  సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 25 పార్లమెంట్ కమిటీలకు చెందిన 1050 మంది కమిటీ సభ్యులతో వర్క్ షాప్ నిర్వహించారు
పార్టీ సీనియర్ నేతలతో కమిటీల్లోని సభ్యులకు శిక్షణ తరగతులు  పార్టీ అధిష్టానం నిర్వహించగా
 వర్క్ షాప్ లో సాధారణ కార్యకర్తలా పాల్గొని శిక్షణా శిబిరాల్లో  చంద్రబాబు భాగస్వామీ అయ్యారు వర్క్ షాప్ జరుగుతున్న ప్రాంగణంలోకి వెళ్లి చివరి సీట్లో కూర్చుని శిక్షణ తరగతులను వీక్షించారు.
నూతనంగా ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు పార్టీ అధినేతగా, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీ కార్యక్రమంలో మాత్రం సామాన్య కార్యకర్తగా  చంద్రబాబు కూర్చున్నారు. నాయుకులు చెప్పేది శ్రద్దగా విని….వర్క్ షాప్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన చంద్రబాబు తోపాటు ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే మంత్రి నారా లోకేష్ ఎక్కడ ఉన్నారు.  ప్రతి రూంలోకి వెళ్లి వర్క్ షాప్ లోని అన్ని బృందాల సభ్యులతో చంద్రబాబు ముచ్చటించారు .సామాన్య కార్యకర్తగా చంద్రబాబు ఒదిగిపోయిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని  కార్యకర్తలు, నాయకులు అభిప్రాయ పడ్డారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version