ప్రధానమంత్రి ఉషా పథకం ఆధ్వర్యంలో జి ఐ ఇ ఐ పథకంతో ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ లో నిర్వహిస్తున్న డ్రోన్ సాంకేతిక శిక్షణ తరగతులు విద్యార్థినులలో విశేష స్పందనను పొందుతున్నాయి. ఈ శిక్షణ ఫిబ్రవరి 17న ప్రారంభమై ఆదివారం 6వ రోజు విజయవంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమానికి పాడేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వి. చిట్టబ్బాయి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు . జీడీసీ మహిళా కళాశాల మర్రిపాలెం ప్రిన్సిపాల్ డా. కె. సుధ గారు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు కార్యక్రమ సమన్వయకర్తలుగా భౌతిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయులు డా. రాజా బాబు, ఆంగ్ల విభాగ ఉపాధ్యాయులు డా. జి. మేరీ పుష్ప, గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు మంగమ్మ వ్యవహరించారు .
ఈ శిక్షణకు వనరుల వ్యక్తిగా కేదార్ హరి హేమ ఆక్సిజన్ డ్రోన్ టెక్నాలజీ మరియు ఎరొలెన్స్ డ్రోన్స్ సంస్థల సీఈఓ వి. శివ కార్తికేయ పాల్గొన్నారు
ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పూర్తి దిన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. దాదాపు 90 మంది విద్యార్థినులు (ప్రథమ సంవత్సరానికి చెందిన 50 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన 40 మంది) ప్రత్యక్షంగా డ్రోన్‌ను నడిపే అవకాశం పొందారు. రిమోట్ కంట్రోలర్ (ఆర్‌సీ) వినియోగం, డ్రోన్ భాగాలు, నియంత్రణ విధానం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించి, ప్రతి విద్యార్థినిని స్వయంగా డ్రోన్ ఎగరబెట్టేలా ప్రోత్సహించారు.
విద్యార్థినులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని, భవిష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా దేశానికి మరియు సమాజానికి సేవ చేయగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చీకటి సమయంలో కూడా డ్రోన్ నియంత్రణ సాధన చేయించడం ద్వారా వారికి ప్రాయోగిక పరిజ్ఞానం మరింత పెరిగింది.
ఆదివారం అయినప్పటికీ కళాశాలకు విచ్చేసిన ప్రిన్సిపాల్ డా. సుధ విద్యార్థినులను ప్రోత్సహిస్తూ శిక్షణను పర్యవేక్షించారు. కళాశాల సిబ్బంది డా. రాజా బాబు, డా. మేరీ పుష్ప, కె. గోళ్ల బాబు, సిఎంఎస్ ప్రతినిధి చంటి బాబు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వనరుల వ్యక్తి వి. శివ కార్తికేయ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులు తమ స్వంత డ్రోన్లను తయారు చేసుకునేలా తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించి, వారిని స్వయం ఉపాధి దారులుగా, యువ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గిరిజన బాలికల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన, నిబద్ధత మరియు అంకితభావం విద్యార్థినులలో ఆనందాన్ని నింపింది.
విద్యార్థినులు ప్రధానమంత్రి ఉషా పథకం, జీడీసీ పాడేరు ప్రిన్సిపాల్ డా. చిట్టబ్బాయి , జీడీసీ మర్రిపాలెం ప్రిన్సిపాల్ డా. సుధ మరియు వనరుల వ్యక్తి శివ కార్తికేయ కు కృతజ్ఞతలు తెలిపారు.
డ్రోన్ శిక్షణకు విద్యార్థినుల ఉత్సాహభరిత స్పందన
RELATED ARTICLES
