Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshవిద్యుత్ చార్జీలు తగ్గించాలి

విద్యుత్ చార్జీలు తగ్గించాలి

అధికారులు చర్యలు చేపట్టాలి

ఆర్థిక ఏడాదికి రూ.339 కోట్ల ఆదా

సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి

విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష

విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు సీఎం. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించటం సహా ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 2028-29 నాటికి విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలను విద్యుత్ శాఖ అధికారుల ముందుంచారు ముఖ్యమంత్రి. విద్యుత్ రంగంలోని వివిధ విభాగాలలో సంస్కరణలు చేస్తే.. మొత్తంగా యూనిట్‌కు రూ.1.32 చొప్పున విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 2028-29 నాటికి యూనిట్ కొనుగోలు ధరను రూ.4.10కు తెచ్చేలా చర్యలు చేపట్టామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. కొనుగోలు ధర రూ.4గా ఉండేలా తగ్గించాలన్నారు. నూతన టెక్నాలజీని, ఇన్నోవేషన్లను ఉపయోగించుకుని విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని అధికారులకు వివరించారు. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నిర్వహించడంతో 2025-26 ఆర్థిక ఏడాదికి సుమారు రూ.339 కోట్ల వరకు ఆదా చేశామని సీఎం అన్నారు. ఈ తరహా పొదుపు చర్యలను మరిన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments