Tuesday, May 5, 2026
HomeNewsఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమం భద్రత లక్ష్యం

ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమం భద్రత లక్ష్యం

ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమము, భద్రత రాష్ట్ర సంఘం లక్ష్యమని రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్లంబర్ యూనియన్ అధ్యక్షుడు డివి సత్యనారాయణ చెప్పారు. మంగళవారం చోడవరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో, శ్రీ సిద్ధి వినాయక ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అండ్ ప్లంబర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూనియన్‌లో మరింత మంది సభ్యులు చేరడం అవసరమని, సభ్యత్వం ద్వారా లభించే ప్రయోజనాలు సంఘ సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్లంబర్స్‌కు భద్రత, సామాజిక రక్షణ, వృత్తి అభివృద్ధి కోసం సంఘం బలోపేతం కావడం అత్యంత అవసరమని తెలిపారు. సంఘం ద్వారా సభ్యులకు భవిష్యత్తులో బీమా, సహాయ నిధులు, శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర
ఉపాధ్యక్షులు కే పాల్ రాజ,ప్రధాన కార్యదర్శి కె. శ్రీహరి రావు,
అనకాపల్లి జిల్లా అధ్యక్షులు తనికెళ్ల కోటేశ్వరరావు లు చోడవరం మండల శ్రీ సిద్ధి వినాయక ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు
కోరుకొండ బ్రహ్మానందం పాల్గొనగా
ప్రెసిడెంట్ గన్ రెడ్డి కళ్యాణ్ గంగాధర్ అధ్యక్షత వహించారు. ఇంకా సెక్రటరీ దాడి శివకుమార్,
కోశాధికారి చప్పా పెంటరావు,
జాయింట్ సెక్రటరీ కోన మధు
పలువురు సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి అందరూ కట్టుబడి పనిచేయాలని తీర్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments