రైతులు, యువత, సమాజాభివృద్ధి అనే మూడు మార్గదర్శక సూత్రాలతో ముందుకు సాగుతున్న డా.ఆర్ఎస్ ఎస్ ప్రయాణం, వ్యవసాయ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తూ, వ్యవసాయం చేసే రైతులకు అండగా మారింది. వ్యవసాయ, సామాజిక రంగాల్లో ఆయన చేస్తున్న విశేషమైన కృషికి రైతుల నుంచే హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి*
*రైతుల అభివృద్ధికి నిరంతర కృషి*
భారత ఆర్థిక వ్యవస్థరు వెన్నెముక అయిన వ్యవసాయం, నేటి కాలంలో అధిక పెట్టుబడులు, తక్కువ ఆదాయం, నేల నిస్వారత వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను అధిగమించి రైతులకు ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అందించేందుకు రామి శెట్టి శివ శంకర్ నిరంతర కృషి
చేస్తున్నాడు.
*కుటుంబ నేపథ్యం*
తండ్రి రామిశెట్టి వీరభద్రయ్య రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, తల్లి రామిశెట్టి రమణమ్మ ఇంటి పని వీరు కడప జిల్లాలోని పులివెందులలో జీవనం సాగిస్తున్నారు.
*నిరుత్సాహానికి తలవంచని విద్యాభ్యాస సంకల్పం*
రామ్ శెట్టి శివశంకర్ పులివెందుల పట్టణంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తదనంతరం లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
2007లో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలకు సిద్ధమై పరీక్ష రాసినా, కేవలం 0.25 మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయారు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా, 2008లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సీ జియాలజీ పూర్తి చేశారు.
2010లో అనిమల్ సైకాలజీ విభాగంలో పీహెచ్డీ పరిశోధన ప్రారంభించి, 2011లో యూజీసీ ప్రాజెక్ట్‌గా “రెడ్ గ్రేప్ ఫ్రూట్” అంశంపై పరిశోధనలు చేపట్టారు. 2012లో యూజీసీ ప్రాజెక్ట్ పూర్తయ్యి, 2014లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పట్టాను పొందారు.
2015లో ప్లాంట్ సైకాలజీ మరియు అనిమల్ సైకాలజీ అంశాలపై విస్తృత పరిశోధనలు నిర్వహించి, సుమారు 40 జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించారు.
2018లో చీనిపంటి పై పరిశోధన కార్యక్రమాలు చేపట్టారు.
2025లో దేశంలోనే తొలిసారిగా దేశీ గోవుల గోమూత్రంతో ‘సూర్యపుత్ర’ అనే పిచికారీ మందును అభివృద్ధి చేశారు. 2018 నుండి 2026 వరకు రైతులకు సూచనలు, సలహాలు అందిస్తూ వస్తున్నారు.
*గ్రామం గ్రామం తిరుగుతూ రైతులకు మార్గనిర్దేశం*
రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ విద్యను అభ్యసించిన రామిశెట్టి శివ శంకర్ ప్రతి గ్రామం తిరుగుతూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు.. పొలాల్లోనే పంటలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కార సూచనలు అందిస్తు..పంటలకు వచ్చే తెగుళ్లు, మట్టి స్వభావం, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూ, శాస్త్రీయ వ్యవసాయ విధానాల వైపు దారితీస్తున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తున్నారు.
*డాక్టర్ ఆర్ యస్ యస్ రీసెర్చ యూట్యూబ్ ఛానల్ ద్వారా సూచనలు*
నేటి వ్యవసాయంలో అధికంగా పురుగుమందులు పడుతూ వస్తున్నారు. అయితే ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఎటువంటి అవగాహన లేకుండా రైతులకు ఎరువులు ఇవ్వడంతో రైతులు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండటం గ్రహించి రైతులు నష్టపోకుండా ఉండాలన్నదే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని యూట్యూబ్ ద్వారా ఏ రోగానికి ఏ మందు పిచికారి చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భూములు ఎలా సారం పెంచాలి అని రైతులకు తెలియజేస్తూ… ఎరువుల వినియోగంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని ఆయన యూట్యూబ్ ద్వారా రైతులకు వివరిస్తున్నారు.
*దేశీ గోమూత్రంతో ‘సూర్యపుత్ర’ ద్రవణం – దేశంలోనే తొలి వినూత్న పరిశోధన*
దేశంలోనే తొలిసారిగా దేశీ గోవుల గోమూత్రంతో ‘సూర్యపుత్ర’ అనే సహజ ద్రవణాన్ని అభివృద్ధి చేశారు. ఈ ద్రవణంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టి, శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేసినట్లు తెలిపారు. పూర్తిగా సహజ విధానాల్లో, ఎలాంటి రసాయనాల వినియోగం లేకుండా ఈ ద్రవణాన్ని రూపొందించారు. ఇందుకోసం తన సొంతంగా దేశీ గోవులను పెంచుతూ, గోమూత్రాన్ని శుద్ధి చేసి దేశీ గోమూత్రంతో పాటు కలబంద, కుంకుడుకాయ, శీకాకాయ, ఉసిరి, వేప, జామాయిల్ వంటి ఏడు రకాల ఔషధ తో వినూత్న ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. ఈ ద్రవణం పంటల ఎదుగుదలకు దోహదపడటంతో పాటు తెగుళ్ల నియంత్రణలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని, తక్కువ ఖర్చుతో రైతులకు లాభదాయకంగా ఉండేలాగా తయారు చేశారు.
*రైతు మేలు కోసం సిట్రస్ ప్రోటోకాల్ పుస్తకం*
2025లో రైతుల మేలు కోసం సిట్రస్ పంటలపై ప్రత్యేకంగా “సిట్రస్” అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండి, రైతుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఇందులో సిట్రస్ పంటల సాగులో పాటించాల్సిన అడుగడుగునా ప్రోటోకాల్, సాగు పద్ధతులు, పోషక నిర్వహణ, రోగ నివారణ వంటి అంశాలను రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.
ఈ పుస్తకం సిట్రస్ సాగు చేసే రైతులకు ఒక మార్గదర్శక గ్రంథంగా ఉపయోగపడుతోంది.
*చిన్న, పేద రైతుల మేలు కోసం అండగా*
చిన్న మరియు పేద రైతుల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుని, వారికి అవసరమైన శాస్త్రీయ అవగాహన, సాగు సలహాలు, ప్రోటోకాల్స్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రైతులు నష్టాల్లో కాకుండా లాభాల దిశగా సాగేందుకు మార్గనిర్దేశం చేస్తూ, వారి జీవనోపాధి మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తున్నారు.
*నిత్యం పొలాల్లోనే జీవిస్తూ సాగించిన పరిశోధనలు*
రెండు సంవత్సరాల పాటు రాత్రి పగలు గుడిసె వేసుకుని నీత్యం పొలాల్లోనే కఠిన పరిశోధనలు నిర్వహిస్తూ, పాములు–తేళ్లు వంటి ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా రైతుల మేలు కోసం నిరంతరం శ్రమించారు.
*ఆచరణే ఆయుధం: వేలాదిమందికి స్ఫూర్తిగా డా.ఆర్ఎస్ఎస్*
రైతులు, యువత, సమాజ అభివృద్ధి అనే త్రిసూత్రాన్ని ఆలోచనగా కాకుండా ఆచరణగా మలుచుకుని ముందుకు సాగుతున్న , డా. ఆర్ఎస్ఎస్ తన కృషితో ఎందరో మందికి దారి చూపే మార్గదర్శిగా నిలిచాడు. మాటలకన్నా పనితోనే తన స్థాయిని నిరూపిస్తూ, వేలాదిమందికి స్ఫూర్తిగా మారాడు.
ఈ ప్రేరణాత్మక ప్రయాణం మరెన్నో జీవితాలకు వెలుగునిచ్చే దీపంలా కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
