Home Politics Andhra Pradesh సౌత్ జోన్ ఖో ఖో పోటీలకు ఐతం విద్యార్థుల ఎంపిక

సౌత్ జోన్ ఖో ఖో పోటీలకు ఐతం విద్యార్థుల ఎంపిక

0

విద్యార్థులు విద్య తోపాటు క్రీడల్లో రాణించాలి

శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి పరిధిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సౌత్ జోన్ ఖో ఖో పోటీలకు ఎంపిక కావడం హర్షదాయకమని కళాశాల యాజమాన్యం ప్రశంసలు కురిపించారు.

విద్యార్థులు సమగ్ర విద్య తో పాటు క్రీడా రంగాలలో ప్రతిభను చాటి ప్రగతి పథంలో ఉజ్వల భవిష్యత్తును నిలబెట్టుకోవాలని ఐతం కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 26 నుంచి కర్ణాటక లోని ద్వాలగిరి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వలసిన ఖో ఖో పోటీల్లో విజయం సాధించాలన్నారు. అంతర్ కళాశాల పోటీల్లో ఈసీఈ విభాగం నుండి కే సిద్ధార్థ, సివిల్ విభాగం నుంచి ఆర్ శృతి లు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆనందం వ్యక్తం చేశారు, జరగబోయే పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు , విభాగాధిపతులు విద్యార్థులను అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version