రోడ్డుపై దీన స్థితిలో వృద్ధురాలు
లయ ఓల్డ్ ఏజ్ హోమ్ కి తరలింపు
సేవే ఊపిరిగా నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ, ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుతూ, అందరికీ ఆత్మబంధువుగా మారిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఓ వృద్ధ మహిళలకు బాసటగా నిలిచారు.
అల్లిపురం, నేరెళ్ల కోనేరు ప్రాంతంలో రోడ్లపై దీనస్థితిలో ఉన్న ఆమెను ఆయన గమనించారు.
ఆమెకు ఎవరు లేరనే విషయం తెలుసుకొని, ఆమె సురక్షితంగా ఉండేందుకు,ఓ వాహనంలో పెందుర్తిలో గల లయ ఓల్డ్ ఏజ్ హోమ్ కి తరలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఆపన్నులకు సహాయం చేయడం అంటే దేవుడికి సేవ చేసినట్లే అని ఆయన చెప్పారు.
కొన్నాళ్లుగా ఆ వృద్ధ మహిళ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండటం గమనించినట్లు చెప్పారు. ఆమెను విచారించగా, ఆమెకు ఎవరూ లేరని తెలిసిందని, ఒంటరిగా రోడ్లపై బ్రతుకు వెళ్లదొస్తుందని తెలుసుకుని ఆవేదన చెందినట్లు తెలిపారు.
ఆమె సురక్షితంగా ఉండేందుకు, పెందుర్తి లో గల లయ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వ్యాన్ ద్వారా పంపించినట్లు పేర్కొన్నారు.
సాయం ఎంతో విలువైనదని,
ఆపదలో ఉన్న వారిని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిని, బాధలతో ఆవేదన చెందుతున్న వారిని అక్కున చేర్చుకుని, వారికి అండగా నిలబడడమే తనకు తెలుసు అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీదేవి, కొండమ్మ, కే.లక్ష్మి, ఎం.లక్ష్మి, కుమారి, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
