విశాఖ పట్నం: జయ జయహే: అనధికార దత్తతలను ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించొద్దని చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం సారధ్యాన శుక్రవారం బాలల దినోత్సవాన్ని పునస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అన్నారు.
అధికారిక దత్తతలనుప్రోత్సహిద్దాం,అనధికార దత్తతలను నివారించేందుకు అవగాహన కల్పిద్దాం పేరిట చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రూపొందించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం కింగ్ జార్జి ఆసుపత్రి పర్యవేక్షణధికారి కార్యాలయంలో జరిగింది,ఈ కార్యక్రమానికి చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి,ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం సంధ్య దేవిల చేతులు మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం డాక్టర్ వాణి,డాక్టర్ కే.వి.ఎస్.ఎం.సంధ్యా దేవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కారా మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే అధికారిక దత్తత పొందడం సులభతరమని అన్నారు,ఆరు దశల్లో సులభతరంగా దత్తతలను స్వీకరించొచ్చని అన్నారు,కింగ్ జార్జి ఆసుపత్రిలో ఈ అధికారిక దత్తతలపై ఎప్పటికపుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు,ముఖ్యంగా చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రూపొందించిన ఇటువంటి కరపత్రాలతో న్యాయ పరమైన అంశాలు,అనధికార దత్తతలవల్ల శిక్షలు,అపరాధ రుసుములపై పూర్తి అవగాన కల్పించే వీలుంటుందని అన్నారు.
చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ బాలల హక్కులు,వారి పరిరక్షణలో భాగంగా వివిధ చట్టాలు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై తమ ఫోరం తరపున ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కే జి.ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.చంద్ర శేఖర్ నాయుడు,ఆసుపత్రి ఆర్.ఎం.ఓ, డాక్టర్ బి.బంగారయ్య,ఆయుర్జీవ సంస్థ ఫౌండర్ ఎస్.సుబ్బలక్ష్మి,చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం ప్రతినిధులు కె.ఎల్లయ్య, సనపల ఢిల్లీ,ప్రవీణ త్రినాథ్,ఎం.హరీష్,బి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
