Home Politics Andhra Pradesh విద్యార్థుల భవిష్యత్తుకు దాతల సహకారం అవసరం

విద్యార్థుల భవిష్యత్తుకు దాతల సహకారం అవసరం

0

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం నగరంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. 9వ డివిజన్ బర్మా కాలనీలోని ఆర్‌సిఎస్ మిల్స్ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ నిధులు రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు, టీవీలు, కుర్చీలు, డిజిటల్ క్లాస్‌రూమ్ సౌకర్యాలను ఆయన ప్రారంభించారు. అలాగే నూతనంగా నిర్మించిన సర్వేపల్లి రాధాకృష్ణ కళావేదికను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జేఎన్ రోడ్డులోని ఎన్టీఆర్ పార్క్ పరిసరాలు, ఏకేసీ కళాశాల జంక్షన్ వద్ద జరుగుతున్న గుంతల పూడిక పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నగర అభివృద్ధి ప్రజల అవసరాల మేరకే జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version