Home Politics Andhra Pradesh పర్వతాలు కాలీ పచ్చదనం పతనం

పర్వతాలు కాలీ పచ్చదనం పతనం

0

ప్రత్యామ్నయం చూపని గ్రానైట్ క్వారీల తవ్వకాలు పర్యావరణ నిబంధనలకు తూట్లు శ్రీకాకుళం జిల్లాలో అష్టలక్ష్మి వైభవం ఈ నే లలో దాగి ఉండి, నిత్య దరిద్రం ఇక్కడ గ్రామాల్లో రాజ్యమేలుతోంది, కొట్లాది రూపాయల ఎగుమతులు తో ఈ ప్రాంతంలోనే గ్రానైట్ రాళ్లు దేశ విదేశాల్లో భారీ వాణిజ్య వ్యాపారాలు కొనసాగుతున్నాయి, పర్యావరణ పరిరక్షణ ఎలాంటి చర్యలు లేకపోగా ఈ గ్రామాల అభివృద్ధి నామమాత్రంగానే ఉంది. అధికారుల అలసత్వంతో క్వారీ యాజమానులు ప్రభుత్వ నిబంధనలు అమలు లో ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలకు కార్యాచరణ లేని కనబడుతుంది, పర్వతాలు రోజురోజుకీ ఖాళీ అవుతున్నప్పటికీ పర్యావరణ o పచ్చదనం, పతనం దిశగా పర్యావరణ హితవరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలు లోపంతో యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఖజానాకు ఆదాయా నీ కి గండి పడుతుందనీ పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.స్థానిక గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనలు గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు, సంస్థలు చేసింది శూన్యంగా ఉందని స్థానికుల ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం పర్వతాల్లో బ్లూ గ్రానైట్ ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుంది ఆంధ్రప్రదేశ్లో నీలం, బూడిద, బహమబ్లూ కోరమండల్ రకాలు గృహ నిర్మాణాలు వంట గదులు, అందమైన ఫ్లోరింగులు , గోడలకు, ప్రాజెక్ట్లు, స్థిరమైన నమూనా బలం సామర్థ్యం ఉన్న ఈ గ్రానైట్ రాళ్లను యూఎస్ఏ, జపాన్, యూరప్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంది ప్రతి భారీ కట్టడాలకు ఈ గ్రానైట్ రాళ్ళను ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లాలోని చీమకుర్తి లో లభిస్తున్న బ్లాక్ గెలాక్సీ రకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత లో ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో లభిస్తున్న బ్లూ గ్రైనేట్ శ్రీకాకుళం నుంచి పలాస పర్వత ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి, కొట్లాది రూపాయల వ్యాపారాలు సంస్థలు కొనసాగినప్పటికీ పర్వతాల పరిరక్షణకు, స్థానిక గ్రామాల కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి చర్యలు జరగడం లేదు అనేది జగమెరిగిన సత్యం. పర్యావరణ ఆమోద ప్రజా సదస్సులను తూతూ మంత్రంగా జరిపి కొంతమంది దళారులు, స్థానికంగా లేని స్వచ్ఛంద సంస్థలతో మమ అనిపించి వారికి ఇవ్వాల్సిన తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. దశాబ్దాల కాలము నాటి తూర్పు కనుమల్లోని ఈ పర్వతాలను పరిరక్షించే బాధ్యత కేంద్రారాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version