ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మాడుగుల ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి
విశాఖపట్నం కి చెందిన మహాదాసు సత్యనారాయణ – సంధ్య దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజుకు ఆలయంలో అందజేశారు. అలాగే తాడి దుర్గారెడ్డి – కృష్ణప్రియ దంపతులు బంగారు శతమానములు అమ్మవారికి కానుకగా సమర్పించారు. వీటిని కూడా ఆలయ కమిటీ అధ్యక్షునికి అందజేశారు. దాతలను ఆయన అభినందించి సత్కరించి అమ్మవారి జ్ఞాపికలను అందజేశారు.
మాడుగుల మోదకొండమ్మ వారికి బంగారు శతమానాలు లక్ష విరాళం
RELATED ARTICLES
