Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshటెక్కలి ఆర్ డి ఓ ఆఫీస్ ను పునర్నిర్మాణం చేపట్టాలి

టెక్కలి ఆర్ డి ఓ ఆఫీస్ ను పునర్నిర్మాణం చేపట్టాలి

బిజెపి టెక్కలి శాఖ డిమాండ్

వందేళ్ళ ఆర్డీవో భవనానికి మరమ్మతులు చేయాలి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోని వందేళ్ళ చరిత్ర కలిగి న టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయను తక్షణమే మరమ్మత్తులు చేపట్టి పునర్నిర్మాణాలను చేయాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధూపాన రాజ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ఎం కృష్ణమూర్తికి తమ బృందం వినతి పత్రం సమర్పించారు.

ఎంతో చారిత్రకమైన ఈ భవన కార్యాలయం నుంచే సేవలు అందజేసారని మాజీ ముఖ్యమంత్రి , ప్రఖ్యాత సినీ నటుడులు నందమూరి తారక రామారావు టెక్కలి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజా సంక్షేమం చేపట్టారు,టెక్కలి డివిజన్ కేంద్రంగా ఎందరికో పరిపాలన సేవలందించిన ఈ భవనం నేడు శిధిలావస్థకు చేరిందని ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి భవన పునర్నిర్మాణం చేపట్టి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని, ఈ భవనం శిథిలం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని, భారతీయ జనతా పార్టీ టెక్కలి శాఖ ప్రతినిధులు కోరినట్లు రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి బిజెపి ఉపాధ్యక్షులు ఆకుల ప్రకాష్ కూన రమణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments