మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా డిమాండ్ చేశారు.
మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళా విజయ ప్రసాద్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆధ్వర్యంలో మల్కాపురం పోలీస్ స్టేషన్ లో నేరుగా పిర్యాదు చేసారు
.‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణ రాష్ట్ర మహిళలందరికీ తలవంచి క్షమాపణ చెప్పాల్సిందేనని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పుకునే కూటమి నాయకులు ఈ ఘటనపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ విమర్శించింది.
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన రాధాకృష్ణపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేసారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కలిదిండి బద్రీనాథ్, బల్ల లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు వార్డ్ అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ,యలగాడ రాజు, పార్టీ పరిశీలికలు పూండి మల్లేశ్వరరావు బోగవల్లి నాగభూషణం, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి నాయకులు, పార్టీ నాయకులు మల్ల ధన లత, గణేష్ మిశ్రా, సోమాదుల సురేష్, పొడవు రాజు, అన్నేపు సూర్యనారాయణ, రేసపు శ్రీనివాసరెడ్డి ,భీమ్ జీ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు
