Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshనేడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

నేడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

రాష్ట్ర ఐటీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న చోడవరం లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు
ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్ రాజు ఆవిష్కరించారు. ఆయన ఆధ్వర్యంలో’ నౌడు సుధాకర్ నాయుడు ఆర్థిక సహకారంతో చోడవరం వినాయకుడి గుడి వద్ద ఈ నెల 23న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి
మొదటి బహుమతిగా 15,000 వేల రూపాయలు,రెండవ బహుమతిగా 10,000 వేల రూపాయలు,3వ బహుమతిగా 8,000 వేల రూపాయలు,4వ బహుమతిగా 6,000 వేల రూపాయలు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కందర్ప రమణ మూర్తి ,నౌడు సుధాకర్ నాయుడు , చోడవరం సీఐ అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నౌడు యూత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments