Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshడిగ్రీ కళాశాలలో ముగిసిన జిల్లా స్థాయి ఆటలు పోటీలు

డిగ్రీ కళాశాలలో ముగిసిన జిల్లా స్థాయి ఆటలు పోటీలు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5 6 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్, గేమ్స్ పోటీలు శుక్రవారం సాయంత్రం తో ముగిశాయి.తొలి రోజు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ జిల్లా స్థాయి బాలికల కబడ్డీ, 100 మీటర్ల రన్నింగ్ పోటీలను ప్రారంభించారు.బాలికల కబడ్డీ పోటీలలో మొదటి స్థానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చోడవరం, ద్వితీయ స్థానం ఉషోదయ డిగ్రీ కళాశాల,100మీటర్ల పరుగు పందెంలో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెలుపొందినది. రెండవ రోజు బాలురులకు జరిగిన ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా ఆరు క్రికెట్, వాలీబాల్ జట్లు పోటీలలో పాల్గొన్నాయి. పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించడం మంచి శుభదాయకమని,ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు పొందవలసిందిగా విద్యార్థులను ఆశీర్వదించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోఆర్డినేటర్, కమిటీ సభ్యులు డాక్టర్ మల్లిబాబు, వెంకటేష్ ఆధ్వర్యంలో ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. వాలీబాల్ పోటీలలో ఉషోదయ డిగ్రీ కళాశాల విన్నర్ గాను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రన్నర్ గా విజయం సాధించారు.100 మీటర్ల పరుగు పందెంలో ఉషోదయ కళాశాల మొదటి స్థానము, ద్వితీయ స్థానము గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, తృతీయ స్థానము ఉషోదయ డిగ్రీ కళాశాల, విజయం సాధించారు.వైస్ ప్రిన్సిపాల్ సత్యవతి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డి.మాల్యాద్రి,బి.పిచ్చమ్మ,కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments