అరకు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని కు తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర విన్నవించారు. అమరావతి లో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని అరకు నియోజకవర్గంలోని తాగునీరు, కమ్యూనికేషన్ కు సంబంధించిన సమస్యలపై విన్నవించారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చే 78 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అరకు నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్న ప్రాంతాలు ఉన్నాయని అవి హుకుంపేట, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకువేలి, అనంతగిరి అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య ఉందని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విన్నవించారు. ఆయా మండలాల్లో ఏయే గ్రామాలలో తాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన వివరాలతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రి చంద్రశేఖర్ కు అందజేశారు.
నెట్వర్క్ సమస్యలు పరిష్కరించండి
అరకు నియోజకవర్గంలో చాలాచోట్ల నెట్వర్క్ సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని సెల్ టవర్ లో పని చేయక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రతి పథకానికి ఆన్లైన్ పద్ధతుల్లోనే దరఖాస్తుల స్వీకరణ, సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నటువంటి ఆర్థిక సహకారం అందిస్తుండడంతో కొన్ని గ్రామాలలో నెట్వర్క్ సమస్య ఎదుర్కోవడంతో అక్కడ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించి నెట్వర్క్ లేని ప్రాంతాల లో ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి చంద్రశేఖర్ స్పందిస్తూ గిరిజన గ్రామాల్లో ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని టిడిపి పార్టీ అరకు ఇన్చార్జి దొన్ను దొర అందజేసిన వినతిపత్రంలో తెలియజేసిన గ్రామాలకు కూడా ఖచ్చితంగా త్వరలోనే తాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
