Home Politics Andhra Pradesh 10వ. తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ.

10వ. తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ.

0

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కెజియా ఫౌండేషన్ ప్రతినిధి బూర్జ బారికి ప్రసాదరావు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జివలస గిరిజన ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో గురువారము కేజియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ బూర్జ బారికి ప్రసాదరావు చేతుల మీదుగా10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయ బోతున్న విద్యార్థులకు సుమారు 18 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్లాంక్స్, పెన్నులు, పరీక్ష సామాగ్రి అందించారు. కేజియా ఫౌండేషన్ ప్రతినిధి ప్రసాదరావు మాట్లాడుతూ పదోవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అని ఈ సమయంలో ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు బాధ్య యుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. విద్యార్థులకు అండగా నిలిచేందుకు తాము ఎల్లప్పుడూ ముందుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బట్టి ఉపాధ్యాయులందరూ కేజియా ఫౌండేషన్ టీం వారిని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, చిన్నమ్మి, సైమన్, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version