ఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి
ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం *’డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండి’* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సంస్థ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, రూఫ్ టాప్ సోలార్, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండి దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండి పృథ్వీతేజ్ విజ్ఞప్తి చేసారు.
