Home Devotional భ‌గ‌వ‌న్నామ‌ముల‌న్నీ మంత్ర‌ములే..!

భ‌గ‌వ‌న్నామ‌ముల‌న్నీ మంత్ర‌ములే..!

0

4వ రోజు ప్రవచన యజ్క్షంలో సామవేదం షణ్ముఖ శర్మ

భ‌గ‌వ‌న్నామ‌ములన్నీ మంత్ర‌ములేన‌ని ప్రవచనవిరించి, వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, సెక్టార్ 6, శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం నాలుగో రోజైన ఆదివారం సాయంత్రం ఆయ‌న ప్ర‌వ‌చిస్తూ పూజ‌వ‌ల్ల ద్ర‌వ్యం, దేహం రెండూ శుద్ధ‌మ‌వుతాయ‌ని క‌ళ్లు మూసినా తెర‌చినా భ‌గ‌వ‌త్ స్పృహ జారిపోకూడ‌దని హొతోప‌దేశం చేశారు. భార్య‌, భ‌ర్త‌ల మ‌నః స్థితినిబ‌ట్టి స‌త్ సంతాన ప్రాప్తం క‌లుగ‌తుంద‌న్నారు. గృహ‌స్తు వైరాగ్య‌వంతుడైతే కామ్య క‌ర్మ‌ల్ని విడిచిపెట్టాల‌న్నారు. కోరిక‌లు ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన‌వై ఉండాలి. ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన‌వి స‌త్క‌ర్మ‌లు అని వివ‌రించారు. య‌జ్ఞం చేత‌ల‌నే ఇంద్రియ‌ములు ప‌నిచేస్తాయి, సంప‌ద‌లు క‌లుగుతాయి. య‌జ్ఞం అంటే భ‌గ‌వ‌ధారాధ‌న అని సామ‌వేదం ఉప‌దేశించారు. ఉన్న‌త ప‌ద‌వుల‌న్నీ నారాయ‌ణుడు అనుగ్ర‌హించేవే. అంద‌రూ ల‌క్ష్మీ క‌టాక్షం కోరుకుంటారు. ల‌క్ష్మి మాత్రం నారాయ‌ణుడ్ని కోర‌కుంటుంద‌న్నారు. నాలుగో రోజు శ్రీ‌మ‌ద్భాగ‌వ‌త ప్ర‌వ‌చ‌న మ‌హాయ‌జ్ఞంలో ఉద్ధాన‌పాతుని ఇద్ద‌రు సురుచి, సునీతి అని భార్య‌లు. వారిలో సునీతి కొడుకు ధృవుడు ఐదేళ్ల వ‌య‌స్సులో తండ్రి త‌నను ఒడిలో కూర్చోబెట్టుకోక‌పోవ‌డంతో త‌ల్లి ద‌గ్గ‌ర వాపోతాడు. త‌న తండ్రి కంటే, తాత కంటే ముల్లోకాల్లో ఎవ‌రికీ లేని గొప్ప ప‌ద‌వి కావాల‌నే ఆలోచ‌న‌తో త‌ల్లిద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. అప్పుడు త‌ల్లి చెప్పిన మాట‌ను ఉప‌దేశంగా తీసుకొని త‌ప‌స్సుకు ఉప‌క్ర‌మించ‌గా ఆ త‌రుణంలోనే నార‌ద మునీంద్రుడు ఎదురుప‌డి వాసుదేవ అనే మంత్రోప‌దేశం చేయ‌గా య‌మునా తీరాన మ‌ధువ‌నంలో త‌ప‌స్సుకు ఉప‌క్ర‌మించిన ధృవుడి ప‌ట్టుద‌ల‌ను భ‌క్తుల‌కు వివ‌రించారు. తీర్థ భూమి, క్షేత్ర భూముల‌కు వెళ్లి చేసే త‌ప‌స్సు ఉప‌యోగాలు ఇందులో పేర్కొన్నారు. క‌ప‌టం లేని మ‌న‌స్సుతో భ‌గ‌వంతుడ్ని ఆరాధిస్తే భుక్తి ల‌భిస్తుంద‌ని ధృవుడి ఏకాగ్ర‌త రుజువు చేసిన ఇతివృత్తంలో భ‌క్తులంతా ప‌ర‌వ‌శించారు. లోకంలో కీర్తి కావాలంటే లోకేశ్వ‌కుడి కాళ్ల ప‌ట్టుకోవాల‌ని ప్ర‌వ‌చ‌న సారాంశం. మ‌నం ఊహించ‌న‌దానికంటే గొప్ప‌ది ఇచ్చేవాడే భ‌గ‌వంతుడు. ధృవుడు త‌ప‌స్సు ద్వారా త‌న తండ్రి వాన‌ప్ర‌స్థంలోకి వెళుతూ రాజ్య‌పాల‌న ఇచ్చాడు. ఆ త‌ర్వాత 36 వేల సంవ‌త్స‌రాల రాజ్య‌పాల‌న చేసిన విష‌యం క‌థ‌లోనీతి అంతా గ్ర‌హించాల‌ని ఆయ‌న వివ‌రించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version