కలెక్టర్ సందర్శన
రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణపులావలో రెండో సోమవారం కూడా కళ్యాణ పోతురాజు బాబు ఆలయ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఊహించిన దానికి భిన్నంగా భక్తులు తరలి రావడంతో రిజర్వాయర్లోని స్నాన ఘాట్లు, రిజర్వాయర్ కు వెళ్లే దారి, అన్న ప్రసాద వితరణ స్టాళ్లు, దర్శనానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లు కిక్కేరిసిపోయేయి. ఎక్కువ మంది భక్తులు రిజర్వాయర్లో స్నానం చేసి క్యూ లైన్ లోకి వెళ్ళకుండా బయట నుండే నమస్కారం చేయడం కనిపించింది. అన్నప్రసాద వితరణ టాల్స్ కూడా భక్తులతో నిండిపోవడంతో ఎక్కువమంది ప్రసాదం స్వీకరించకుండానే వెను తిరిగారు. సోమవారం కూడా దొండపూడి నుంచి కళ్యాణకుల వరకు ఉన్న ఎనిమిది కిలోమీటర్ల రహదారిలో ద్విచక్ర వాహనాలు బస్సులు, కారులు రాకపోకలు సాగించినప్పటికీ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు దారిపొడిగిన బందోబస్తు నిర్వహించారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఎండోమెంట్ శాఖ వారు పూర్ణకుంభంతో కలెక్టర్ కు ఆహ్వానం పలికారు. అనకాపల్లి డిఎస్పి శ్రావణి క్షేత్రంలో బస చేసి బందోబస్తు ఏర్పాట్లు సమీక్షించారు. అన్నప్రసాదాలు తయారీలో స్వయంగా ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పాల్గొని గరిట తిప్పారు.
