యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి, స్థానిక గివెర్నెమెంట్ డిగ్రీ కాలేజీ ( మహిళలు) లో గురువారం క్రాఫ్ట్ డెమోన్స్ట్రేషన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ హస్త కళలు విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి గోవెర్నెమెంట్ డిగ్రీ కాలేజీ ( మహిళలు) ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు. ప్రారంభించారు. డెవలప్మెంటు కమిషనరు హస్తకళలు, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సహకారంతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రిస్తవ మైనారిటీ కార్పొరేషన్ ప్రారంభించటం జరిగిందని తెలిపారు. అథిదులుగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ హస్త కళలు విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మిగోవెర్నెమెంట్ డిగ్రీ కాలేజీ ( మహిళలు) ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు, మాజీ అటవీ శాఖ అధికారి బాబురావు , డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ,పిడి సుధీర్ కుమార్,పాల్గొన్నారు .
ఈ సందర్భంగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ హస్త కళలు విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి యువత భారతీయ హస్త కళలు ఫై అవగాహనా పెంచుకోవాలి అని తెలిపారు. గోవెర్నెమెంట్ డిగ్రీ కాలేజీ ( మహిళలు) ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు మాట్లాడుతూ , ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మంచి అవగాహనా పెంచుకోవాలి అని , ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్స్ కు ధన్యవాదములు తెలిపారు .
ఈ కార్యక్రమంలో. 100 మంది విద్యార్థులు , 25 మంది హస్త కళాకారులు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి వచ్చిన హస్త కళాకారులూ వారి హస్త కళలు ప్రదర్శించారు.
క్రాఫ్ట్ డెమోన్స్ట్రేషన్ అవేర్నెస్ కార్యక్రమం
RELATED ARTICLES
