Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshభూ బకాసురుడు ఎంపీ శ్రీ భరత్ ను చట్టం శిక్షించే వరకు పోరాడుతాం సిపిఐ,సిపిఎం

భూ బకాసురుడు ఎంపీ శ్రీ భరత్ ను చట్టం శిక్షించే వరకు పోరాడుతాం సిపిఐ,సిపిఎం

విశాఖ జిల్లా ఎండాడ ప్రాంతానికి చెందిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ పార్లమెంటు సభ్యుడు
శ్రీ భరత్ ను శిక్షించాలి. రాష్ట్ర కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు బంధుప్రీతితో ప్రభుత్వ భూమలను చట్ట విరుద్ధంగా జీవోలు జారీ చేసి
జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి పంపించడం , ప్రజా వ్యతిరేక విధానం, రాజ్యాంగ విరుద్ధమని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు హెచ్చరిస్తున్నాయి. విశాఖ జీవీఎంసీ ప్రధాన ద్వారం దగ్గర ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ధర్నా చేయడం జరిగింది
కౌన్సిల్ సమావేశానికి ముందుగా పర్మిషన్ ఇచ్చి
మల్ల ఆ పర్మిషన్ ని రద్దు చేయడం వెనుక ఉన్న ప్రభుత్వ కూటమితీరు , జీవీఎంసీ మేయర్ బాగోతం ప్రజలకు అర్థమైందని, భూ అక్రమాల్ని పోరాటాల ద్వారా అడ్డుకుంటామని, కౌన్సిల్ సమావేశంలో
జి ఓ కి వ్యతిరేకంగా సహచర కార్పొరేటర్లతో మా గళాన్ని వినిపిస్తాం. కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మేయర్ మరియు కార్పొరేటర్లు గుండాలుగా ప్రవర్తించడం సరికాదని ప్రజల చేత ఎన్నుకోబడిన మనం ప్రజల కోసం పనిచేయాలని టిడిపి కార్పరేటులకు హితువు పలికారు. ఏజే స్టాలిన్ , డా. వి. గంగారావు, రాష్ట్ర సిపిఐ నాయకులు కే లోకనాథ్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments