తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించి కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. సంబంధిత ఎస్హెచ్వోల ఆధ్వర్యంలో జరిగిన ఈ కౌన్సిలింగ్లో చట్టపాలనపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.
అలాగే గంజాయి సేవించడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని, గంజాయి వల్ల మానసిక-శారీరక దుష్ప్రభావాలు ఏర్పడతాయని తెలిపారు. మానసిక స్థితి, ఏకాగ్రత, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి దెబ్బతినడమే కాక శరీర కదలికలు బలహీనపడతాయని వివరించారు. నేరాలకు దూరంగా ఉండి చట్టానికి సహకరించాలని సూచించారు.
